Saturday, February 1, 2025

ఓహో రత్తమ్మ..

- Advertisement -
- Advertisement -

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. ఈ సినిమాలో ఈ యంగ్ హీరో సోను మోడల్, లైలాగా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించడం చాలా ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. టీజర్, మొదటి రెండు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. శుక్రవారం థర్డ్ సింగిల్ ఓహో రత్తమ్మ విడుదలైంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఓహో రత్తమ్మ అందరినీ అలరించే మాస్ ఫీస్ట్ అందిస్తుంది. పెంచల్ దాస్, మధుప్రియల జానపద శైలి వోకల్స్ ఈ పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. విశ్వక్‌సేన్ ట్రెడిషినల్ నుంచి అల్ట్రా-స్టైలిష్ వరకు వివిధ రకాల లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ఆకాంక్ష శర్మ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News