Saturday, November 23, 2024

రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్‌లో జరిగిన 9వ భారత్ థాయ్‌లాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ రష్యా నుంచి చమురు కొనుగోలును సమర్ధించుకున్నారు. ఇంధన, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అలాంటి సమయంలో రష్యా నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయడం తప్పు కాదన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల చాలా వరకు కంపెనీలు తమ ఇంధనాన్ని ఐరోపా దేశాలకు సరఫరా చేస్తున్నాయని, ప్రస్తుతం రష్యా నుంచి ఐరోపా దేశాలు తక్కువ స్థాయిలో ఇంధనాన్ని తీసుకుంటున్నాయని జైశంకర్ తెలిపారు. అసాధారణ రీతిలో వీటి ధరలు పెరుగుతుండటంతో ఆసియా దేశాలకు ఇంధనం సరఫరా చేసే సంప్రదాయ దేశాలన్నీ ఇప్పుడు యూరప్‌కు తరలిస్తున్నాయని మంత్రి జైశంకర్ తెలిపారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే ఉత్తమ డీల్‌ను కుదుర్చుకున్నట్టు చెప్పారు.

Oil buying to low price from Russia: Jaishankar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News