Monday, December 23, 2024

చమురు కంపెనీలకు భారీ లాభాలు.. సామాన్యుడికేదీ ఊరట?

- Advertisement -
- Advertisement -

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1లక్ష కోట్ల ప్రాఫిట్
గ్లోబల్ మార్కెట్‌లో తగ్గిన క్రూడ్ ధరలతో ప్రయోజనం
పెరిగిన పెట్రో ధరలనే కొనసాగిస్తూ సామాన్యుడిపైనే భారం
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు జూ న్ త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయిలో లాభాలను నమో దు చేస్తున్నాయి. దేశంలో పెరిగిన డీజిల్,-పెట్రోల్ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆయిల్ కం పెనీలు మాత్రం ప్రయోజనం పొందుతున్నాయి. లీటరు పెట్రోలు ధర రూ.110 వరకు పెరిగింది. చాలా నెలలుగా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు పెట్రో ధరల్లో తగ్గుదల మాత్రం లేదు. మరోవైపు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతీయ కంపెనీలు ఇటీవల రష్యా నుండి ముడి చమురును తగ్గింపు రేటుతో కొనుగోలు చేస్తున్నాయి. దీని వల్ల భారత చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. భారత చమురు మార్కెటింగ్ కంపెనీ(ఒఎంసి)లు రికార్డు స్థాయిలో లాభాలను ఆ ర్జిస్తున్నాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించిం ది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల పన్నుకు ముందు లాభాలు కనీసం రూ.లక్ష కోట్లు ఉండవచ్చని, ఇది కొత్త రికార్డుగా నిలవనుందని పేర్కొంది.

గతంలో ఎ న్నడూ భారతీయ చమురు కంపెనీలు ఈ స్థాయిలో లా భాలు ఆర్జించలేదు. క్రిసిల్ నివేదిక ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ చమురు మార్కెటింగ్ కం పెనీల నిర్వహణ లాభం రూ. 1 లక్ష కోట్లు ఉంటుంది. 2016-17 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో చ మురు సంస్థల లాభాలు సగటున రూ.60 వేల కోట్లు మా త్రమే ఉన్నాయి. అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరం(202223)లో ఈ సంఖ్య రూ.33 వేల కోట్లుగా ఉంది. క్రిసిల్ ప్రకారం, భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీల రికార్డు స్థాయి లాభాలకు రెండు కారణాలు ఉ న్నాయి. దేశీయంగా డీజిల్, పెట్రోల్ ధరలు ఖరీదైనవిగా ఉండడం, మరొకటి గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ల గణనీయంగా తగ్గుముఖం పట్టండంతో ఆయిల్ కంపెనీలు ప్రయోజనం పొందుతున్నాయి. క్రిసిల్ ప్రకారం, క్రూడాయిల్ ధర 2023-24 ఆర్థిక సంవత్సరంలో 30 శా తానికి పైగా పడిపోయింది. చాలా కాలంగా రెండు ప్రధా న ఇంధనాల రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. చివరిసారిగా డీజిల్-, పెట్రోల్ ధరలు 2022 మేలో తగ్గించారు. అంటే 14 నెలలుగా డీజిల్, పెట్రోలు ధరలు తగ్గకపోగా, క్రూడాయిల్ మరింత చౌకగా మారింది. దేశంలో డీజిల్, పెట్రోల్ రిటైల్ ధరలను ఇండియన్ ఆయిల్, ఇతర ప్ర భుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News