Thursday, December 19, 2024

సంవత్సరానికి 24 సార్లు పంట చేతికొస్తది: హరీష్ రావు, నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

చిన్నకోడూర్: ఆయిల్ ఫామ్ ఆదాయం జీతం లెక్క ప్రతినెలా వస్తుందని, జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని, వ్యవసాయ సాగులో రైతులు మార్పులు సాధించాలని రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. సిద్ధిపేట జిల్లా చందలాపూర్ లోని ఆయిల్ ఫామ్ నర్సరీని క్షేత్ర స్థాయిలో మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు, నిరంజన్ రెడ్డి  మాట్లాడారు. ప్రతి సంవత్సరం 24 సార్లు పంట చేతికొస్తదని, భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్ ఫామ్ పంటగా మంత్రులు చెప్పుకొచ్చారు. లక్ష కోట్ల రూపాయల ఆయిల్ ఫామ్ ను విదేశాల నుంచి మన దేశానికి దిగుమతి చేసుకుంటున్నామని, గుణాత్మక మార్పు నెలకు 30 వేలు డబ్బు వచ్చే పంటగా అధిక దిగుబడి, అధిక ఆదాయం కలిగిన ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతగానో శ్రేయస్కరం అని మంత్రులు పేర్కొన్నారు.

జిల్లాలో 10వేల ఎకరాలకు సంబంధించిన ఆయిల్ ఫామ్ మొక్కలు సిద్ధంగా ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా పెద్ద రైతులకు అవగాహన కల్పించి ఆయిల్ ఫామ్ సాగుకై చైతన్య పర్చాలని వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. ఆయిల్ ఫామ్ మంచి లాభదాయకమైన పంట అని, రైతులకు సేవ చేసినవారమవుతామని, 30 నుంచి 40 దశాబ్దాల కాలం వరకూ రైతులకు, ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయేలా సేవ చేసే అవకాశం ఉందని అధికారులకు, ప్రజాప్రతినిధులను మంత్రులు కోరారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 3వేలు, ప్రతీ సంవత్సరం 3 వేలు కలుపుకుని ఇప్పటికే 6300 ఎకరాలు నాటామని, ఈ 2,3 నెలల్లో మరో 4 వేల ఎకరాలు ప్లాంటేషన్ చేయనున్నామని, మొత్తం10 వేల ఎకరాలు లక్ష్యంగా ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News