Monday, December 23, 2024

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/మోత్కూరు: ఆయిల్ ఫాం సాగుతో అధిక లాభాలు పొందవచ్చని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని టిఆర్‌ఎస్ జిల్లా నాయకుడు గోరుపల్లి సంతోష్‌రెడ్డి అన్నారు. మోత్కూరు మండలం అనాజిపురం గ్రామంలో సంతోష్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం 12 ఎకరాల్లో గురువారం ఆయిల్ ఫాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఆయిల్ ఫాం సాగు చేయవచ్చని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగును ప్రోత్సహించేందుకు సబ్సిడీ కూడా ఇస్తున్నాయన్నారు. ఆయిల్ ఫాం మొక్కలు ఒక్కసారి నాటితే సుమారు 30, 40 ఏళ్ల వరకు దిగుబడి వస్తాయని, దిగుబడి మొదలైతే రైతుకు ఎప్పుడూ ఆదాయం వస్తూనే ఉంటుందని, డిమాండ్ ఉన్న పంట కావడంతో మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం జిల్లాను ఆయిల్ ఫాం సాగుకు ఎంపిక చేసినందున నీటి వసతి, ఆసక్తి ఉన్న రైతులు సాగు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ మమత, మార్కెట్ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, రైతులు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, గోరుపల్లి సతీష్‌రెడ్డి, కొల్లు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News