Wednesday, January 22, 2025

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వ్యవసాయాన్ని బలోపేతం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సంకిరెడ్డిపల్లి దగ్గర ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కెటిఆర్ శంకుస్థాపన చేసిన సందర్భంగా శుక్రవారం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తెలంగాణ వ్యాప్తంగా లక్షా 25 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు అవుతోందని, ఒక్క వనపర్తి జిల్లాలో ఐదు వేల ఎకరాల్లో పంట సాగు అవుతోందని పేర్కొన్నారు. దేశంలో 22 వేల మిలియన్ టన్నుల నూనె అవసరం అవుతోందని, 15 వేల మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నామన్నారు. సిఎం కెసిఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని నిరంజన్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News