సమీక్షలో సీఎస్ సోమేష్‌శ్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పంట సాగుకు కోసం రూపొందించిన లక్ష్యాలను చేరుకోవటంలో భాగంగా గురువారం తన కార్యాలయంలో ఆయిల్ పామ్‌సాగుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర్ంలలో ఆయిల్‌పామ్ సాగును చేపట్టేందకు అవసరమైన విస్తృత సమాచారం రైతులకు అందజేసేందుకు ప్రత్యేక మోబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు తెలిపారు.వ్యవసాయరంగంలో రైతులకు ఆయిల్ పామ్ సాగు ద్వారా నాలుగైదు రెట్లు లాభదాయకంగా ఉండేందుకు ఈ పంట సాగును 20లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళిక రూపొందించిందని తెలిపారు. తోటల సాగుకోసం ఈ ఆర్ధిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1000కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికే1.85లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌తోటలను సాగు చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్దం చేసివుంచామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నేలలు , వాతావరణం ఆయిల్‌పామ్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయని సిఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ , వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ ఎండి సురేందర్ రెడ్డి, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అఖిల్ , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.