- Advertisement -
చెన్నై : తుపాన్, భారీవర్షాలు వరదలతో తల్లడిల్లుతోన్న చెన్నైలో ఇప్పుడు చమురుల సమస్య తలెత్తింది. వరదల నడుమ ప్రత్యేకించి చెన్నైలోని ఎన్నోర్ ప్రాంతంలో దట్టమైన చమురు పొరలు పొర్లుతున్నాయి. ఈ ప్రాంతంలో అనేక చమురు కంపెనీలు ఉన్నాయి. అదే విధంగా పెట్రో కెమికల్ పరిశ్రమలకు కూడా ఈ ప్రాంతం ఆలవాలంగా ఉంది. ఇటీవలి వరదలతో ఈ ఫ్యాక్టరీలు దెబ్బతిని చమురు వరదనీటి ద్వారా బకింగ్‌హామ్ కెనాల్‌లోకి చేరుకొంటోంది.
స్థానికులు దీనిని గుర్తించి అధికారులకు తెలియచేశారు. ఈ చమురు విపరీత స్థాయిలో దట్టమైన తెట్టెలుగా నల్లటి చారికలుగా ఇప్పుడు కెనాల్ పై తేలుతోంది. ఇది సమీపంలోని నదిలో కలిసే అవకాశం ఉంది .అధికార యంత్రాంగం ఈ చమురు ప్రవాహం గురించి ఆరా తీస్తున్నారు. తమ ఫ్యాక్టరీల నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజీ జరగలేదని చెన్నై పెట్రోకెమికల్ లిమిటెడ్ (సిపిసిఎల్) ప్రకటన వెలువరించింది.
- Advertisement -