Sunday, February 23, 2025

జగిత్యాలలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. మెట్పల్లి పట్టణ శివారు పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారిపై అదుపుతప్పి ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడడంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయి. డ్రైవర్ వెంటనే బయటకు దూకి దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాడు. క్రమంగా మంటలు భారీగా ఎగిసిపడడంతో ఆయిల్ ట్యాంకర్ పూర్తిగా దగ్ధమైంది.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది… ఫైర్ ఇంజిన్లతో దాదాపు అర్థగంటపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News