ముంబై: పూణె- ముంబై ఎక్స్ ప్రెస్ వేపై మంగళవారం మధ్యాహ్నం లోనావాలా సమీపంలో నూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, రోడ్డుపైకి పోయే వాహనదారులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. రోడ్డపై ట్యాంకర్ పడడంతో భారీగా మంటలు చెలరేగాయి. కుడే గ్రామ సమీపంలోని ఓవర్‌బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి శ్రమిస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్, పూణే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్, లోనావాలా ఖోపోలీ మునిసిపల్ కార్పొరేషన్‌ల నుండి అగ్నిమాపక దళం, ఐఎన్ఎస్ శివాజీతో సహా వివిధ అత్యవసర సహాయ సంస్థలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ ప్రమాదం జరగడంతో దాదాపు 7-8 కిలోమీటర్ల పొడవైన ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. పూణే వైపు ట్రాఫిక్ నెమ్మదిగా కొనసాగడానికి అనుమతించినప్పటికీ హైవే అధికారులు లోనావాలా బైపాస్ మీదుగా వచ్చే ట్రాఫిక్‌ను ముంబై వైపు మళ్లించారు.
#Oiltanker meets with #accident in #Mumbai-Pune e-way; 3 killed, 2 injured.@Journo_Swarali reports pic.twitter.com/AneYA8XPTC
— Mirror Now (@MirrorNow) June 13, 2023