Thursday, August 29, 2024

ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్ మునక..16 మంది సిబ్బంది అదృశ్యం

- Advertisement -
- Advertisement -

ఒమన్ తీరంలో రెండు రోజుల క్రితం మునిగిపోయిన ఒక చమురు ట్యాంకర్‌లోని 13 మంది భారత జాతీయులతో సహా సిబ్బంది జాడ తీయడానికి భారతీయ నౌకాదళం తన దీర్ఘశ్రేణి సాగరప్రాంత నిఘా విమానం ‘బోయింగ్ పి81’ని, ఒక యుద్ధనౌకను రంగంలోకి దింపింది. కొమొరోస్ పతాకం గల చమురు ట్యాంకర్ ఎంవి ప్రెస్టీజ్ ఫాల్కన్ సోమవారం (15న) ఒమన్‌లోని రాస్ మద్రకాహ్‌కు ఈశాన్యంగా 25 నాటికల్ మైళ్లు (సుమారు 12 కిమీ) దూరంలో మునిగిపోయింది. ఆ వాణిజ్య నౌకలో మొత్తం16 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకన్లు.

ఆ ప్రాంతంలో మోహరించిన భారతీయ నేవీ యుద్ధనౌక సాయం అందించడానికి స్వల్ప నోటీసులో బయలుదేరినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. ఒమన్ సమన్వయంతో అన్వేషణ, సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. అయితే, సముద్రంలో పరిస్థితి అనుకూలంగా లేదు. బలమైన గాలులు వీస్తున్నాయి. బోయింగ్ పి81లో నిర్దిష్ట రాడార్లు, ఏరియా సెన్సర్లు ఉన్నాయి. ఆ రాడార్లు, సెన్సర్ల నుంచి చిత్రాలను భారత్‌లోని కంట్రోల్ రూమ్‌లకు ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు. వాటిని భారతీయ యుద్ధనౌకతో పంచుకోవచ్చు. చమురు ట్యాంకర్ మునిగిపోయినట్లు ఒమన్ మారిటైమ్ సెంటర్ మంగళవారం సాయంత్రం వివరాలు పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News