Monday, December 23, 2024

శాసనసభలో ఐదు బిల్లులకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం లభించింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును ముఖ్యమంత్రి కెసిఆర్ తరఫున శాసనసభలో మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టగా.. బిల్లుకు ఆమోదం లభించింది. టిమ్స్ ఆసుపత్రుల బిల్లు, కర్మాగారాల చట్ట సవరణ బిల్లు, మైనార్టీ కమిషన్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభలో చర్చ లేకుండా కేవలం మంత్రుల వివరణలతోనే బిల్లులకు ఆమోదం లభించింది. అలాగే.. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు సైతం శాసనసభ నుంచి ఆమోదం లభించింది. ఇవాళ విపక్షాలు లేవనెత్తిన పలు ప్రశ్నలతో దద్దరిల్లిన అసెంబ్లీ సాయంత్రం 6.30 గంటల వరకు సజావుగా సాగింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో గవర్నర్ తిప్పి పంపిన నాలుగు బిల్లులను మరోసారి శాసనమండలి ఆమోదించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News