Monday, December 23, 2024

విలక్షణమైన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

హీరో శర్వానంద్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. సైన్స్ ఫిక్షన్ నేపధ్యంతో డిఫరెంట్ కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, మరీ ముఖ్యంగా తల్లీ కొడుకుల బంధం పరంగా విలక్షణమైన చిత్రమిది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ద్విభాషా చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను తెలుగు, తమిళం భాషలలో విడుదల చేశారు. ట్రైలర్ కథాంశాన్ని, భావోద్వేగ సంఘర్షణను, విజువల్స్‌లో ఉన్నత సాంకేతిక నైపుణ్యం చూపుతుంది. శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని చక్కని నటన కనబరిచారు. శ్రీ కార్తీక్ రచయిత, దర్శకుడిగా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు.ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో ‘కణం’ పేరుతో ఏకకాలంలో విడుదల కానుంది.

‘Oke Oka Jeevitham’ Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News