Saturday, January 11, 2025

ఇవి రేసులో వెనుకబడిన ఓలా

- Advertisement -
- Advertisement -

'Okinawa' is at the top in Vahan portal

నాలుగో స్థానంతో సరి
టాప్‌ప్లేస్‌లో ఒకినావా

న్యూఢిల్లీ: చమురు ధరలు పెరగడంతో పాటుగా ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీ పెరగడం ఎక్ట్రానిక్ వాహనాల ధరలు తగ్గడం వంటి కారణాలతో ప్రజల్లో విద్యుత్ వాహనాలపై మోజు పెరుగుతోంది. దీనికి అనుగుణంగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు సైతం అందుబాటులోకి వస్తుండడంతో వీటి కొనుగోలుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంతో విద్యుత్ వాహనాలను తయారు చేసే కంపెనీలు విరివిగా పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.తాజాగా వీటి మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో తెలిపే గణాంకాలు ఇటీవల విడుదలయ్యాయి. జూన్ నెలకు సంబంధించి విద్యుత్ వాహన రిజిస్ట్రేషన్ల వివరాలను ‘ వాహన్’ వెలువరించింది. ఇందులో ‘ఒకినావా’ అగ్రస్థానంలో ఉంది. కాగా విడుదలకు ముందే సంచనాలకు మారుపేరుగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్ ఈ రేసులో వెనుకబడింది. జూన్ నెలలో 5,753 వాహనాల రిజిస్ట్రేషన్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ వరకు అగ్రస్థానంలో కొనసాగిన కంపెనీ మే నెలలో తొలిసారి అగ్రస్థానాన్ని కోల్పోయి రెండో స్థానానికి దిగజారింది. జూన్ నెలలో ఈ కంపెనీ రిజిస్ట్రేషన్లు మరింత పడిపోవడంతో నాలుగో స్థానానికి చేరింది.

ఈ విషయంలో 6,782 రిజిస్ట్రేషన్లతో ఒకినావా తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఏంపియర్( 6,199), హీరో ఎలక్ట్రిక్ (6,049) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఏథర్, రివోల్ట్, ప్యూర్ ఇవి, బెన్లింగ్.. ఓలా తర్వాతి స్థానాల్లో వచ్చాయి. మొత్తం 8 కంపెనీల జాబితాను ‘ వాహన్’ పోర్టల్ ప్రచురించింది. అయితే టూవీలర్ వాహనాల్లో అగ్రగాములైన బజాజ్, టివిఎస్‌లు ఈ జాబితాలో లేవు. ఇక కంపెనీల విషయం అటుంచితే జూన్ నెలలో మొత్తం 32,807 విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. మే నెలలో ఈ సంఖ్య 32,680గా ఉంది. కంపెనీల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ వాహనాల సంఖ్యలో మాత్రం పెద్దగా పెరుగుదల కనిపించకపోవడం గమనార్హం.

ఇటీవల విద్యుత్ వాహన బ్యాటరీలు కాలిపోతున్న ఉదంతాలవల్ల వీటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు జంకుతున్నారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరో వైపు ఈ ఉదంతాల నేపథ్యంలో బ్యాటరీల్లో లోపాల నిగ్గుతేల్చేందుకు కేంద్రం ఓ నిపుణుల కమిటీని నియమించింది. కొన్ని కంపెనీలు భద్రతను పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం కేంద్రం దృష్టికి వచ్చింది. మరికొన్ని కంపెనీలు తక్కువ ధరకే వాహనాలను అందించడం కోసం నాసిరకం బ్యాటరీలను వినియోగిస్తున్నట్లు కూడా కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News