Wednesday, December 25, 2024

చిత్తూరులో ఓలా ఎలెక్ట్రిక్ ప్రత్యేక ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

ఒకే చోట అన్ని సర్వీసులనూ అందజేసే లక్ష్యముతో, అనుభవ కేంద్రము విద్యుత్ వాహన ఔత్సాహికులకు ఓలా యొక్క విద్యుత్ వాహన టెక్నాలజీని అనుభవించడానికి, వాహనాలకు సంబంధించి ఏదైనా సమాచారమును సేకరించుకోవడానికి వీలు కలిగిస్తుంది. కస్టమర్లు S1, S1 ప్రో యొక్క టెస్ట్ రైడ్‌లను కూడా పొందవచ్చు, ఓలా యొక్క బ్రాండ్ ఛాంపియన్ల నుండి కొనుగోలులో సహాయత పొందవచ్చు, ఓలా యాప్ పైన తమ కొనుగోలు ప్రయాణమును పరాకాష్టకు తీసుకువెళ్ళవచ్చు. అనుభవ కేంద్రము సర్వీసింగ్, రిపేర్ వంటి విక్రయానంతర సేవలను కూడా అందజేస్తుంది. 2023 మార్చి నాటికి ఓలా విభిన్న ఫార్మాట్ల వ్యాప్తంగా 200 అనుభవ కేంద్రాలను ప్రారంభిస్తుంది.

ఓలా ఎలెక్ట్రిక్ సి.ఎం.ఓ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. “కస్టమర్లు ఇతర విభాగాలలో D2C నమూనాను ఉపయోగించేవారు, అయితే ఆటోమొబైల్స్ లో కాదు. మేము దానిని మార్చివేశాము. మా ప్రోడక్టులను కస్టమర్లకు ఎంత ఉత్తమంగా తీసుకువెళ్ళి విద్యుత్ వాహనానికి వారి పరివర్తనను చేయగలమో మేము మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఓలా అనుభవ కేంద్రాలు మాకు వీలు కలిగిస్తాయి” అన్నారు. దీని కేటగరీలో అత్యంత అధునాతనమైన స్కూటర్లలో ఒకటిగా స్థానం కల్పించబడి, ఓలా S1, S1 ప్రో, అత్యంత ప్రసిద్ధి చెందిన మ్యూజిక్ ప్లేబ్యాక్, న్యావిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి మూవ్ఓఎస్ ఫీచర్లతో, S1 ప్రోలో ఈకో మోడ్ యొక్క మినహాయింపుతో వస్తాయి.

ఈ పండుగ సీజనులో, కస్టమర్లు ఓలా S1 ప్రో కొనుగోలుతో రు.10,000 వరకూ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. S1, S1 ప్రో రెండూ కూడా, పండుగ సీజన్ అంతటా అన్ని బ్యాంకుల నుండి 0% లోన్ ప్రాసెసింగ్ ఫీజుతో అదనంగా రు.2000ల అదనపు ప్రయోజనాలతో, ఎంపిక చేయబడిన అనుభవ కేంద్రాల ద్వారా భరోసాతో కూడిన 7-రోజుల డెలివరీతో లభిస్తాయి. అంతమాత్రమే కాదు, పొడిగించబడిన వ్యారెంటీ పైన కస్టమర్లు రు.1500 తగ్గింపును కూడా పొందుతారు. ఓలా ఎలెక్ట్రిక్ తన మొట్టమొదటి ఎలెక్ట్రి వెహికల్ ని 2021 ఆగస్టులో ఆవిష్కరించింది మరియు ప్రపంచం యొక్క అతిపెద్ద 2 వీలర్ తయారీ కర్మాగారము-ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఎలెక్ట్రిక్ మొబిలిటీ కొరకు ప్రపంచ పరివర్తనను వేగవంతం చేయడానికి గాను ఎలెక్ట్రిక్ వాహనాల యొక్క ఘనమైన మార్గసూచీని నిర్మించే దిశగా ఇది పనిచేస్తూ ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News