Monday, December 23, 2024

ఓలా చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ఎక్స్‌ని విడుదల చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.80,000గా కంపెనీ నిర్ణయించింది. దీంతో పాటు ఓలా నాలుగు ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా ఆవిష్కరించింది. ఇవి వచ్చే ఏడాది అంటే 2024లో విడుదల కానున్నాయి. మంగళవారం జరిగిన ఓలా ఎండ్ ఐస్ ఏజ్ ఈవెంట్‌లో కంపెనీ కస్టమర్లను తన ఫ్యాక్టరీకి ఆహ్వానించింది. ఓలా మొత్తం 8 ఉత్పత్తి, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను వెల్లడించింది.
మూడు వేరియంట్లలో ఓలా ఎస్1ఎక్స్
ఓలా ఎస్1ఎక్స్ 6కెడబ్లు హబ్- మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. దీనిని 2కెడబ్లుహెచ్, 3కెడబ్లుహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలో ప్రారంభించారు. ఇది 151 కి.మీ పరిధిని కల్గివుంటుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఎస్1ఎక్స్ స్కూటర్ కంపెనీ ప్రస్తుత రెండు ఉత్పత్తుల నుండి డిజైన్‌లో చాలా భిన్నంగా లేదు. 7-అంగుళాల టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా అందించారు. ఎస్1ఎక్స్ స్కూటర్ 2కెడబ్లుహెచ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది.

ఓలా ఎస్1 ప్రో నవీకరణ
నవీకరించిన ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,47,499గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ ఈ స్కూటర్ పనితీరు, పరిధిని పెంచింది. గతంలో 181 కి.మీ రేంజ్ ఉండే ఈ స్కూటర్ ఇప్పుడు చార్జ్‌పై 195 కి.మీల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది 4కెడబ్లుహెచ్ బ్యాటరీతో 11 కెడబ్లు మోటారును కలిగి ఉంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 120 కి.మీగా ఉంగి. కంపెనీ 2023 సెప్టెంబర్ నుండి ఈ స్కూటర్ డెలివరీని ప్రారంభించనుంది.
మరో నాలుగు ఇబైక్‌ల ప్రదర్శన
ఓలా 2024లో ప్రారంభించనున్న 4 బైక్‌లను కూడా ఆవిష్కరించింది. 4 ఎలక్ట్రిక్ బైక్‌లు రోడ్‌స్టర్, అడ్వెంచర్, సూపర్‌స్పోర్ట్, క్రూయిజర్‌లు వచ్చే ఏడాది నాటికి విడుదల చేయనున్నారు. ఓలా తన బైక్‌లలో సరికొత్త ఫీచర్లు అందిస్తోంది. దీనికి శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్ కూడా జోడించారు. ఒక్కసారి చార్జ్ చేస్తే ఈ బైక్‌లు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News