Thursday, November 21, 2024

కొన్ని బ్యాచ్‌ల ఓలా స్కూటర్స్ రీకాల్!

- Advertisement -
- Advertisement -

Ola Electric recalls 1441 E-scooters

చెన్నై : ఇటీవల ఎలక్ట్రానిక్ వాహనాల్లో అగ్నిప్రమాదాలపై దర్యాప్తు చేసిన అధికారులు చేసిన సిఫార్సుల ఆధారంగా కొన్ని బ్యాచ్‌ల ఎలక్ట్రానిక్ స్కూటర్లను రీకాల్ చేసే అవకాశాలున్నాయని ఎలా వ్యవస్థాపకుడు, సిఇఓ భవిష్ అగర్వాల్ చెప్పారు. గౌహతిలో ఇటీవల ఓలా ఇస్కూటర్‌లో మంటలు చెలరేగడంతో వాహనంపై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఓలా స్కూటర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వాహనంలో ఏ భాగమూ పని చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని, ఓవర్ స్పీడ్, భయంతో వాహనదారు సడన్ బ్రేక్ వేయడం వల్ల జరిగిందని ఈ సంఘటనపై స్పందిస్తూ కంపెనీ తెలిపింది. గౌహతి ప్రమాదం మార్చి మధ్యలో జరిగింది. ఆ తర్వాత ఇలాంటివే మరికొన్ని సంఘటనలు కూడా జరిగాయి. అంతేకాక ఓలా ఇ స్కూటర్స్‌కు సంబంధించిన పలు సమస్యలపై కస్టమర్లనుంచి కంపెనీకి ఫిర్యాదులు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసులను పరిష్కరించడం కోసం ప్రపంచస్థాయి ఏజన్సీలను సంప్రదిస్తున్నట్లు అగర్వాల్ ట్విట్టర్‌లో తెలిపారు. తమ సంస్థపై వినియోగదారుల విశ్వాసం చెక్కు చెదరకుండా ఉండేలా చూడడానికి తాము ప్రయత్నిస్తామని ఆయన ఆ ట్వీట్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News