Wednesday, January 22, 2025

ఓలాలో 15 వేల వరకు ఫెస్టివల్ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సంక్రాంతి పండుగ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ రూ. 15వేల విలువైన హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ జనవరి 15వ తేదీ వరకు ఉంటుంది. ఈ ఆఫర్‌లో భాగంగా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ కొనుగోలుపై రూ. 6,999
వరకు ఎక్స్‌పాండబుల్ బ్యాటరీ వారంటీ, రూ. 3వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్, ఆకర్షణీయమైన ఫైనాన్స్ డీల్‌లు ఉన్నాయి. అదనంగా ఎస్1 ఎక్స్+ ఫ్లాట్ రూ.20 వేల తగ్గింపుతో రూ.89,999 వద్ద అందుబాటులో ఉంటుంది.

క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో రూ.5 వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఎస్1 ప్రో (2వ తరం) ధర రూ. 1,47,499 కాగా, ఎస్1 ఎయిర్ ధర రూ. 1,19,999గా ఉంది. అదనంగా ఎస్1ఎక్స్ మూడు వేరియంట్‌లలో పరిచయం చేసింది. ఎస్1 ఎక్స్ (3కెడబ్ల్యుహెచ్), ఎస్1 ఎక్స్ (2కెడబ్ల్యుహెచ్) కోసం రిజర్వేషన్ విండో రూ. 999 వద్ద ఉంది. ఇది వరుసగా రూ. 99,999 రూ. 89,999 ప్రారంభ ధరలోఅందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News