- Advertisement -
భారీ డిమాండ్‌లో సైట్ క్రాష్
న్యూఢిల్లీ: త్వరలో మార్కెట్లోకి రానున్న తమ విద్యుత్ స్కూటర్‌కు బుకింగ్ ప్రారంభించినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ డాట్‌కామ్‌లో రూ.499 రిఫండబుల్ డిపాజిట్ చెల్లించి స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. అద్భుతమైన పనితీరు,సాంకేతికత, డిజైన్, ధర.. ఇవన్నీ వినియోగదారులు ఈ వాహనం వైపు మొగ్గు చూపేలా చేస్తాయి’ అని ఓలా చైర్మన్, గ్రూపు సిఇఓ భావిష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఓలా స్కూటర్ ప్రత్యేకతలను కంపెనీ ఇప్పటివరకు వెల్లడించలేదు. కాగా గురువారం బుకింగ్ ప్రారంభం అయ్యాయో లేదో విపరీతమైన డిమాండ్ కారణంగా ఓలా ఎలక్ట్రిక్ వెబ్సైట్ క్రాష్ అయింది. దీనిపై కంపెనీ సిఇఓ అగర్వాల్ ట్విట్టర్లో క్షమాపణలు కోరారు. పోర్టల్‌లో ఒకే సారి ఎక్కువ మంది లాగిన్ కావడానికి ప్రయత్నించడంతో సైట్ క్రాష్ అయినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -