Thursday, January 23, 2025

త్వరలో ఐపీవోకు వెళ్లనున్న ఓలా ఎలక్ట్రిక్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ ఐపీవోకు వెళ్లనున్నది. ఐపీవో ద్వారా రూ.5,500 కోట్ల నిధుల సేకరణకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఐపీవోకు అనుమతి కోరుతూ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్పీ) దాఖలు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ సొంతంగా 4.73 కోట్ల షేర్లు విక్రయించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ప్రతిపాదిత ఐపీఓలో ద్వారా 9.52 కోట్ల షేర్లను విక్రయించాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఏయే తేదీల్లో ఓలా ఎలక్ట్రిక్ ఐపీవోకు వెళుతుందన్న సంగతి తెలియరాలేదు. 2008లో ఐపీవో ద్వారా బజాజ్ ఆటో.. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన తర్వాత ఒక టూ వీలర్స్ తయారీ సంస్థగా ఓలా ఎలక్ట్రిక్ ఐపీవోకు వెళ్లడం 15 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. భారత్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ రంగంలో ఓలా ఎలక్ట్రిక్ ‘మార్కెట్ లీడర్’గా ఎదిగింది. నవంబర్ నెలాఖరు నాటికి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో 32 శాతం వాటా ఓలా ఎలక్ట్రిక్’దే. ఇప్పటి వరకు 30 వేల టూ వీలర్స్‌ను విక్రయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News