Monday, December 23, 2024

పార్సిల్ డెలివరీ సేవల్లోకి ‘ఓలా’

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ఓలా తాజాగా పార్సిల్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు రైడ్ సేవలను మాత్రమే అందిస్తున్న కంపెనీ ఇకపై డెలివరీలు అందించేందుకు సిద్ధమైంది.‘ ఓలా పార్సిల్’ పేరిట డెలివరీ సేవలను ప్రారంభించింది. బెంగళూరువాసులకు మొదటగా ఈ సేవలను పరిచయం చేసింది.‘ బెంగళూరులో ‘ఓలా పార్సిల్’ను ప్రారంభించాం. ఈ సేవలను అందించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే ఉపయోగిస్తాం’ అని ఓలా సహవ్యవస్థాపకుడు, సిఇఓ భవీశ్ అగర్వాల్ శనివారం తన అధికారిక ‘ఎక్స్’ద్వారా తెలియజేశారు. 5 కిలోమీటర్ల లోపు దూరానికి రూ.25, 15 కిలోమీటర్ల దూరానికి రూ.75,

అలాగే 20 కిలోమీటర్ల దూరానికి రూ.100 చార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు నగరమంతటా ఈ పార్సిల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఓలా తెలిపింది. త్వరలోనే దేశంలోని మిగతా నగరాలకు ఈ సేవలను విస్తృతం చేయనున్నట్లు తెలిపింది.స్విగ్గీ ఆధ్వర్యంలోని జెనిస్,రిలయన్స్ మద్దతుతో పని చేస్తున్న డుంజో సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడం కోసం ఈ సర్వీసును ఓలా తీసుకువచ్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం స్విగ్గీ డెలివరీ సంస్థ జెనిస్ రెండు కిలోమీటర్ల దూరానికి రూ.60 చార్జి వసూలు చేస్తున్నది. తక్కువ ధరకే డెలివరీసర్వీస్ సొల్యూషన్‌ను తీసుకురావడమే తమ లక్షమని భవీశ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News