Wednesday, January 22, 2025

200 మంది ఇంజినీర్లపై ఓలా వేటు

- Advertisement -
- Advertisement -

Ola Laying off 200 engineers

న్యూఢిల్లీ : దేశీయ టాక్సీ రైడ్ ప్రొవైడర్ కంపెనీ ఓలా తన 200 మంది ఇంజనీర్లను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్- ఆధారిత కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇంజనీర్లను తొలగించబోతోంది. ఓలా దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే కంపెనీ వాటిని తిరస్కరించింది. ఓలా తన పునర్నిర్మాణ పనులను వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే కంపెనీ కోత నిర్ణయానికి వచ్చింది. మొత్తం ఇంజనీర్ల వర్క్‌ఫోర్స్‌లో 10% తొలగింపు అంటే సంస్థ మొత్తం 2000 మంది ఇంజనీర్లలో, 200 మందిని తొలగిస్తున్నారు. ఓలా తన ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నందున ఈ నిర్ణయానికి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News