Wednesday, January 22, 2025

ఒకే రోజు 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు ప్రారంభించిన ఓలా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్(ఇవి) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. దేశంలో ఇవిల డిమాండ్‌కు అనుగుణంగా వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ దేశవ్యాప్తంగా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను(ఇసి) ప్రారంభిస్తోంది. హన్మకొండ రాయపుర పరిధి హన్మకొండ రోడ్‌లో కొత్త ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించి వరంగల్‌లో కంపెనీ తన డి2సి అడుగుజాడను విస్తరించింది. ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆఫ్‌లైన్ ఉనికిని విస్తరిస్తున్నామని అన్నారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు వినియోగదారులకు ఎస్1 ఎస్1 ప్రో మోడళ్లను టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని అందిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News