Monday, December 23, 2024

ఓలా ఎస్1 ప్రో జెన్2 స్కూటర్ల డెలివరీ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన ఓలా ఎలక్ట్రిక్ ఎస్ 1ప్రో జెన్ 2 స్కూటర్ల డెలివరీ మొదలు పెట్టింది. ఓలా ఎస్ 1 ప్రో జనరేషన్ 1 స్కూటర్‌కు మరిన్నిఆధునిక ఫీచర్లను జోడించి ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వందకు పైగా నగరాల్లో ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యాయని ఓలా తెలిపింది. ఇక ఈ స్కూటర్ ఫాచర్ల విషయానికి వస్తే ఈ విద్యుత్ స్కూటర్ ఒక సారి చార్జింగ్ చేస్తే 195 కిలోమీటర్లు వెళ్లవచ్చు.గంటకు 120 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో వెళ్లవచ్చని కంపెనీ తెలిపింది.తక్కువ బరువుండేలా ఈ స్కూటర్‌ను డిజైన్ చేశారు. ఐదు రంగుల్లో ఈ స్కూటర్ లభిస్తుంది.ఈ స్కూటర్ ధర రూ.1.47,499( ఎక్స్ షోరూం )గా ఓలా ప్రకటించింది.ఓలా అధికారిక యాప్ ద్వారా కూడా ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News