Thursday, January 23, 2025

ఆగస్ట్ 15న ఓలా ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

Ola Electric Car

ముంబై: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంతో ఇప్పటికే మార్కెట్లో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ మరో కొత్త ఉత్పత్తితో ఆగస్ట్ 15న ప్రజల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ ధ్రువీకరించారు. 2021 ఆగస్ట్ 15న ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేయడం గమనించాలి. సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజు మరో ఉత్పత్తిని ఆవిష్కరిస్తోంది. ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాన్ని (కారు) తీసుకురానున్నట్టు ఓలా టీజర్ ఇస్తోంది. ‘‘ఆగస్ట్ 15న నూతన ఉత్పత్తి గురించి ప్రకటిస్తున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. భవిష్యత్తుకు సంబంధించి భారీ ప్రణాళికలను సైతం అదే రోజు పంచుకుంటాం’’ అని భవీష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న కొత్త ఉత్పత్తిని ఆవిష్కరిస్తామని చెప్పడమే కానీ, అది కారా? లేక మరో టూవీలరా? అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎల్ఐ పథకం కింద బ్యాటరీల తయారీపై ప్రోత్సాహకాలకు ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే ఎంపికైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News