Monday, December 23, 2024

వినియోగదారుడికి రూ. 1 లక్ష చెల్లించాలని ఓలా కు ఆదేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కస్టమర్ ని డ్రయివర్ మధ్యలోనే దించేసి ఆగం చేసినందుకు రూ. 1 లక్ష వినియోగదారుడికి చెల్లించాలని కిరాయి కార్లు నడిపే సంస్థ ‘ఓలా’ ను డిస్ట్రిక్ట్ కన్జూమర్ రిడ్రెస్సల్ కమిషన్- III హైదరాబాద్ ఆదేశించింది. దీనికి తోడు వినియోగదారుడికి ఖర్చుల కింద రూ. 5000 చెల్లించాలని కూడా ఆదేశించింది.

ఆబిడ్స్ కు చెందిన జాబేజ్ శామ్యూయెల్ 2021 అక్టోబర్ 19న నాలుగు గంటల కోసం కారును బుక్ చేసుకున్నాడు. అతడు, అతడి భార్య, మరో వ్యక్తి క్యాబ్ ఎక్కారు. పైగా ఆ క్యాబ్ శుభ్రత లేకుండా, వాసన కొడుతూ ఉండింది. ఏసిని వేయమని కోరినా డ్రయివర్ నిరాకరించాడు. తర్వాత 5 కిమీ. వరకు వెళ్లి డ్రయివర్ వారిని కారు దిగిపొమ్మన్నాడని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. పైగా 5 కిమీ. దూరానికి డ్రయివర్ రూ. 861 ఛార్జీ చేశాడట. ఆ తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయగా, దానికి బాగా ఖర్చవ్వడమే కాక, సమయం కూడా వృథా అయిందని ఫిర్యాది పేర్కొన్నారు. ఈ కేసులో ఓలా క్యామ్స్ ను ప్రతి వాదిని చేశారు. కాగా ఓలా క్యాబ్స్ డ్రయివర్ను రెస్పాండెంట్ చేయలేదని పేర్కొంటూ అన్ని ఆరోపణలను నిరాకరించింది. తమ సర్వీసులను ఆమోదించిన వ్యక్తి తమ నియమాలు, షరతులు, ఛార్జీలకు ఆమోదం తెలిపారని వాదించింది. పైగా డ్రయివర్ ప్రవర్తన బాగా లేదన్న ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం కూడా లేదని వాదించింది.

ఇరుపక్షాల వాదన విన్న వినియోగదారుల కమిషన్ హైదరాబాద్ కస్టమర్ కు రూ. 1 లక్ష చెల్లించాలని, దానికి అదనంగా ఖర్చుల కింద రూ. 5000 చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News