Wednesday, January 22, 2025

తమిళనాడులో ఓలా భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

చెన్నై: ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ ఓలా తమిళనాడులో భారీగా పెట్టుబడి పెట్టనుంది. విద్యుత్ వాహనాల తయారీ కోసం ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు రూ.7,614కోట్లు వెచ్చించనుంది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో శనివారం ఒప్పందం చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఓలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విద్యుత్ ద్విచక్రవాహనాలు, కార్లు, లిథియం, సెల్ గిగా ఫ్యాక్టరీని చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సిఇఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఓలా ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొత్తగా విద్యుత్ వాహన పాలసీ 2023ని ఆవిష్కరించింది. రూ.50వేల కోట్లు సమీకరణ, లక్షన్నర ఉద్యోగాల కల్పన లక్షంగా ఈ పాలసీని రూపొందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News