Sunday, February 2, 2025

కాంగ్రెస్ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కి పెంపు : కమల్‌నాథ్

- Advertisement -
- Advertisement -

భోపాల్ : వచ్చే ఏడాది ఆఖరులో మధ్యప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే వృద్ధాప్య పెన్షన్ రూ. 1000 కు పెంచుతామని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు కమల్‌నాథ్ సోమవారం వెల్లడించారు. అంతకు ముందు ఆయన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్)ను తిరిగి అమలు చేస్తామని, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 300 నుంచి 600 కు పెంచామని, అయితే కొంతమంది ఎమ్‌ఎల్‌ఎల పార్టీ ఫిరాయింపుల కారణంగా తమ ప్రభుత్వం కూలిపోవడంతో రూ.1000 పెన్షన్ పొందే హక్కు నలిగిపోయిందని ట్వీట్ చేశారు. డిసెంబర్ 12న కమల్‌నాధ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగుల మేజర్ డిమాండ్ అయిన ఒపిఎస్‌ను తిరిగి అమలు చేస్తామని వెల్లడించారు.

మధ్యప్రదేవ్‌లో 2005 జనవరి 1 న, లేదా తరువాత నియామకమైన ప్రభుత్వ ఉద్యోగులంతా న్యూ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్)కింద వచ్చారు. తాను ముఖ్యమంత్రిగా 2018 ఆఖరి నుంచి 2020 మార్చి వరకు ఉన్నప్పుడు వ్యవసాయ రుణ మాఫీ అమలులో ఉండేదని, ఇప్పుడు తిరిగి అమలు చేస్తామని డిసెంబర్ 18న కమల్‌నాథ్ ప్రకటించారు. ఈ వాగ్దానాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తీవ్రంగా తిప్పికొట్టారు. అవన్నీ కమల్‌నాథ్ గతంలో అమలు చేయలేక పోయారన్నారు.

గతంలో అధికారం లోకి వస్తే పదిరోజుల్లోనే వ్యవసాయ రుణాలు రూ. 2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రకటించారని కానీ అది నెరవేర్చలేక పోయారన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 4000 చెల్లిస్తామన్నారని, కానీ చెల్లించలేక పోయారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్ రేట్లు రూ. 5 వరకు తగ్గిస్తామని కాంగ్రెస్ ప్రకటించినా, రూ.5 శాతం వరకు ఇంధనంపై సెస్సు పెంచారని, అందువల్ల అలాంటి బూటకపు హామీలు ప్రజలు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News