Thursday, September 19, 2024

విచారణకు సిద్ధమా?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో మాటల యుద్ధం నడిచింది. గత బిఆర్‌ఎస్ సర్కార్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీ వ్ర స్థాయిలో ఫైరయ్యారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ అన్ని రంగాల్లో అవినీతి చే సిందని అసెంబ్లీలో మండిపడ్డా రు. గొర్రెల స్కాం, కేసీఆర్ కిట్లు, ఆఖరుకు ఆడ బిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల్లోనే స్కాం చేశారని సీఎం విమర్శించా రు. ఇంత జరిగినా సభలో మాజీ మంత్రి హరీష్‌రావు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్తేనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుండుసున్నా ఇచ్చారని చె ప్పా రు. రంగారెడ్డి జి ల్లాలో భూములను కొల్లగొట్టి చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేసి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యా రు. భారాస ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడా రు. “అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్‌రావు అమ్మకాల లెక్కలు చె ప్పట్లేదు. ప్రజలు శిక్షించినా వాళ్ల ఆలోచన మారలేదు. భారాస హయాంలో రూ. లక్షల కోట్ల విలువైన ఓఆర్‌ఆర్‌ను రూ.7 వేల కోట్లకు అమ్మారు.

పదేళ్లలో పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకున్నారు. కానీ జిల్లాకు సాగునీరు ఇవ్వలేదు. ఈ ప్రాం తాన్ని ఎడారిగా మార్చారు. బతుకమ్మ చీరలు అని చెప్పి సూరత్ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారు. ఆ చీరలు కూడా పొలాల్లో బెదురుకోసం వాడుతున్నారని, ఆడబిడ్డలు వా టిని కాల్చివేసిన సందర్భం కూడా ఉందన్నారు. బతుకమ్మ చీర లు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత నాకుంది. సభలో అబద్ధాలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. 2018 డిసెంబర్ లోపే విద్యుత్ మీటర్లు బిగిస్తామని కేంద్రానికి కేసీఆర్ చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్‌రావు స్పందించాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో రంగారెడ్డి జి ల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అని బీఆర్‌ఎస్ నేతలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీకి మెట్రోలో వస్తా
నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నిధులిచ్చినా, ఇవ్వకపోయినా మెట్రో నిర్మాణం పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి మెట్రో రైల్ లో ఓల్డ్‌సిటీలో తిరుగుతానని అన్నారు. పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదు, ఒర్జినల్ సిటీ అని వ్యాఖ్యానించారు. శనివారం శాసనసభలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ పాతబస్తీ మెట్రో నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. మెట్రో నిర్మాణంపై ఎల్ అండ్ టీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు గత ప్రభుత్వం 32 కి.మీ. మెట్రో నిర్మాణానికి టెండర్లు పిలిచిందని, కేవలం స్థిరాస్తి సంస్థలకు మేలు చేసేందుకే ఆ మార్గంలో మెట్రో నిరా్మాణానికి పూనుకున్నట్లు ముఖ్యమంత్రి విమర్శించారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి ఎయిర్‌పోర్టుకు విస్తారమైన మంచి రోడ్లు ఉన్నాయని, ఎయిర్‌పోర్టుకు ఆ మార్గంలో కారులో వెళ్లేవారుంటారు తప్ప మెట్రోలో ఎవరు వెళుతారని ఆయన ప్రశ్నించారు. మెట్రో అవసరం లేని మార్గాల్లో నిర్మాణానికి టెండర్లు పిలిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఎల్‌బినగర్ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో నిర్మించనుందని తెలిపారు. పాతబస్తీ ప్రజలకు మేలు కలిగేలా చాంద్రాయణగుట్ట మీదుగా మెట్రో నిర్మాణం పూర్తి చేసేందుకు తాము సిద్ధమని, రెండో దశ మెట్రో నిర్మాణానికి నిధులు కోరితే కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పాతబస్తీ, ఎయిర్‌పోర్టుకు మెట్రోను కచ్చితంగా నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి భూసేకరణను ఇప్పటికే మొదలుపెట్టినట్లు వెల్లడించారు. భూసేకరణకు రూ.2600 కోట్లు అవసరం అవుతుందని తెలిపారు. ఈ సందర్భ ంగా అక్బరుద్దీన్ చేసిన పలు వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ సమాధానమిచ్చారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా అన్నాను : సిఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణకు నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యూపి, బిహార్, గుజరాత్‌లకే అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని బహిరంగసభలోనే మోడీకి చెప్పానని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రాల పట్ల పెద్దన్నలాగా వ్యవహరించాలని ప్రధాని మోడీని కోరానని, అందుకే ప్రధానిని పెద్దన్న అని సంబోధించినట్లు చెప్పారు. అందులో తప్పేముందని సిఎం అన్నారు. రాష్ట్రానికి నిధులు సాధించటం కోసం పెద్దన్న అని సంబోధించానని వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తన బాధ్యత సక్రమంగా నిర్వహర్తించానన్నారు. మోడీని పొగిడితే తనకేం రాదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అలా అన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని తమ పార్టే ఫిర్యాదు చేసిందని, పోలీసులు విచారణ తర్వాత నిర్వాహకులపై ఎప్‌ఐఆర్ నమోదు చేసి అమిత్‌షా పేరు తొలగించారని దీనిపై న్యాయపోరాటం చేస్తున్మామని అక్బరుద్దీని అరోపణలపై వివరణ ఇచ్చారు

అమిత్ షా మీ మిత్రుడు కాబట్టే ….కేసును కొట్టివేశారు : అక్బరుద్దీన్
ఎన్నికల సమయంలో తనతో సహా ముస్లింలపై తప్పుడు కేసులు పెట్టారని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. తనది తప్పు కాదని తెలిసి కూడా పోలీసు కమిషనర్ కేసు ఉపసంహరించేది లేదని అన్నారని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మీ మిత్రుడు కాబట్టి ఆయనను కేసు నుండి తప్పించారని అక్బరుద్దీన్ శాసనసభలో అన్నారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని, రాత్రి పదిన్నర దాటితే ఇంటి ముందు ఉన్న వారిని కూడా కొడుతున్నారని ఆక్షేపించారు. హత్యలు జరుగుతున్నాయని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మంచి అధికారులను నియమించుకోవాలని కోరారు. డ్రగ్స్‌పై పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని కొనియాడారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని దీనిపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రతి పథకానికి రేషన్‌కార్డులు అడుగుతున్నారని, కొన్నేళ్లుగా ఎవరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, వాటిని త్వరగా అందించే కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవాలని అక్బరుద్దీన్ కోరారు. తన చివరి శ్వాస వరకు మజ్లిస్ పార్టీలోనే కొనసాగుతానని అక్బరుద్దీన్ అన్నారు. తనను ఉపముఖ్యమంత్రిగా చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు. తాను మజ్లిస్ పార్టీలోనే ఉంటానని, పార్టీలో సంతోషంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు. చివరి శ్వాస వరకు మజ్లిస్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదేనని, కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నెరవేర్చాలన్నారు. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి తాను కృషి చేశానన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే హైదరాబాద్‌కు మెట్రో రైలు వచ్చిందన్నారు. పాతబస్తీకి మాత్రం ఇప్పటి వరకు మెట్రో రాలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News