Monday, January 20, 2025

పాత ఫీజులే?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వానికి నివేదించనున్న టిఎఎఫ్‌ఆర్‌సి వారంలో తుది నిర్ణయం

ఇంజినీరింగ్, వృత్తి విద్యా కోర్సులకు

మన : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ఈ సారి పాత ఫీజులే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. గత రెండేళ్లుగా కరోనా పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం పాత ఫీజులు కొనసాగించాలని టిఎఎఫ్‌ఆర్‌సి సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. వచ్చే విద్యా సంవత్సరంలో పాత ఫీజులనే అమలు చేసి, ఆ తర్వాత ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇంజినీరింగ్, ఇతర వృత్తి వి ద్యా కోర్సులకు సంబంధించి ఫీజుల ఖరారు ప్రక్రియను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ పూర్తి చేసింది. సోమవారం జరిగిన టిఎఎఫ్‌ఆర్‌సీ సమావేశంలో ఫీజులకు సంబంధించి వివిధ ప్రతిపాదనలపై కమిటీ సభ్యులు చర్చించించారు.

ఒక సంవత్సరం పాటు పాత ఫీజులను కొనసాగించడం, 10 శాతం ఫీజులు పెంచడం తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో టిఎఎఫ్‌ఆర్‌సి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆమోదిస్తే వెంటనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్ర స్తుతం ఇంజినీరింగ్ గరిష్ఠ ఫీజు రూ.1.40 లక్షలు గా ఉంది. దీన్ని మొదట్లో రూ.1.34 లక్షలుగా ని ర్ణయిస్తే…. కొన్ని కాలేజీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి రూ.1.40 లక్షలకు పెంచుకున్నాయి. రా ష్ట్రంలో మొత్తం 175 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో ప్రస్తుతం 20 కాలేజీల్లో ట్యూ షన్ ఫీజు రూ.35 వేలుగా ఉంది. పాత ఫీజులు కొ నసాగించేందుకు ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఫీజు లే వచ్చే విద్యాసంవత్సరం

వచ్చే ఏడాది పెరిగే అవకాశం

ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం పాత ఫీజులే అమలు చేస్తే, వచ్చే ఏడాది ఫీజులు పెంచే అవకాశం కనిపిస్తోంది. వృత్తి విద్యా కోర్సుల ఫీజులపై మూడేళ్లకోసారి టిఎఎఫ్‌ఆర్‌సి సమీక్షిస్తుంది. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు మూడేళ్ల క్రితం అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 202122 విద్యాసంవత్సరంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 202223 నుంచి 202425 వరకు అమలు కానున్న వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారుకు టిఎఎఫ్‌ఆర్‌సి గత జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి ఫీజుల ఖరారు ప్రక్రియను పూర్తి చేసింది. అయితే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం పాత ఫీజులే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, వచ్చే ఏడాది వచ్చే విద్యాసంవత్సరం కూడా కొనసాగనున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు వచ్చే విద్యాసంవత్సరం పాత ఫీజులే అమలు చేస్తే, వచ్చే ఏడాది ఫీజులు పెంచే అవకాశం కనిపిస్తోం ది.

వృత్తి విద్యా కోర్సుల ఫీజులపై మూడేళ్లకోసారి టిఎఎఫ్‌ఆర్‌సి సమీక్షిస్తుంది. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు గత మూడేళ్ల క్రితం అమలు చేసిన ఫీజుల కాలపరిమితి 202122 విద్యాసంవత్సరంతో ముగిసింది. ఈ నేపథ్యంలో 202223 నుంచి 202425 వరకు అమలు కానున్న వృత్తి విద్యా కోర్సుల ఫీజుల ఖరారుకు టిఎఎఫ్‌ఆర్‌సి గత జనవరిలో షెడ్యూల్ విడుదల చేసి ఫీజుల ఖరారు ప్రక్రియను పూర్తి చేసింది. అయితే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వచ్చే విద్యాసంవత్సరం పాత ఫీజులే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, వచ్చే ఏడాది మరోసారి టిఎఎఫ్‌ఆర్‌సి ఫీజులను సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పిజిఇసెట్, పిఇసెట్ మినహా అన్ని ప్రవేశ పరీక్షలు పూర్తయ్యా యి. ఈ నెలలోనే ఎంసెట్, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్ సహా దాదాపు అన్ని ప్రవేశ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర సాంకేతిక విద్యా కోర్సులకు కౌన్సెలింగ్ ఈ నెల, వచ్చే నెలలో జరగనున్నాయి. వారం పది రోజుల్లో ఫీజులు ఖరారు చేయడంపై టిఎఎఫ్‌ఆర్‌సి దృష్టి సారించింది. రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్, 120 ఫార్మ సీ, 54 ఫార్మాడీ కాలేజీలు, 272 ఎంబిఎ, 42 ఎంసిఎ కాలేజీలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News