Monday, December 23, 2024

కలెక్టరేట్ ఎదుట వృద్దుడి ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: తన భూమి పత్రాలు అధికారులు పోర్జరీ చేశారని ఆరోపిస్తూ ధర్మారం మండల ఖిలా వనపర్తి గ్రామానికి చెందిన రామచంద్రరావు(75) జిల్లా కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన భూమికి సంబంధించిన పత్రాల పోర్జరీ గురించి అధికారులను కలిసేందుకు పెద్దపల్లికి వచ్చిన ఆయన అధికారులను కలిస్తే పట్టంచుకోలేదని మనస్థాపం చెంది పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రైల్వే శాఖలో పని చేసి, పదవి విరమణ పొందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు.

అన్నదమ్ముల మద్య భూ వివాదం ఉందని, ఇందులో పత్రాలను అధికారులు పోర్జరీ చేశారని రామచంద్రరావు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ప్రదీప్ కుమార్, ఎస్‌ఐ మహేందర్‌తో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం రామచంద్రరావుకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News