- Advertisement -
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుడిసెలో నిద్రిస్తున్న ఓ వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఆదివారం రాత్రి అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో వెలుగుతున్న కొవ్వొత్తు చుట్టూ ఉన్న బరకలు ప్రమాదవశాత్తు అంటుకుని మంటలు చెలరేగాయి. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న వృద్ధుడు జల్లి పెద్ద బిక్షం(80) మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్తలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Old Man burnt alive in Aswaraopeta
- Advertisement -