- Advertisement -
డ్రైనేజ్ పైప్ లైన్ కోసం తవ్విన గోతిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటనా నగరంలోని టోలిచౌకి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గులాం మహమ్మద్ అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు గుంతలో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడు మృతి చెందడంతో స్థానికులు కాంట్రాక్టర్, జలమండలి అధికారులపై ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
- Advertisement -