Wednesday, January 22, 2025

వైరా రిజర్వాయర్‌లో పడి వృద్ధుడి మృతి

- Advertisement -
- Advertisement -

వైరా : వైరా రిజర్వాయర్‌లో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన గురువారం వైరాలో చోటు చేసుకుంది. వైరా పోలీసుల, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం బోనకల్లు మండలం చిన్నబీరెల్లి గ్రామానికి చెందిన కొప్పు దాసు (75) తన కుమారుడు వైరాలో నివాసం ఉండటంతో ఇటీవల వైరాకు వచ్చాడు. బుధవారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వైరా రిజర్వాయర్ వైపు వచ్చి ప్రమాదవశాత్తూ కాలు జారి రిజర్వాయర్‌లో పడి మృతి చెంది ఉంటాడని మృతుని బంధువులు అంటున్నారు. మృత దేహన్ని వైరా పొలీసులు భైటకు తీసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News