Sunday, December 22, 2024

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడికి మూడేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Old Man jailed for misbehaving with girl

హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం… సరూర్‌నగర్ మండలానికి చెందిన బాధితురాలు తన కూతురు(5)ను తన తల్లి వద్ద వదిలేసి పనికి వెళ్లింది. డిసెంబర్19,2015న వారి ఇంటి పక్కన ఉన్న వృద్ధుడు కృష్ణారెడ్డి బాలిక దుస్తులు తిసివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్సై సుధాకర్ దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News