Monday, December 23, 2024

వృద్ధుడిని గ్లాస్ ముక్కతో పొడిచి….

- Advertisement -
- Advertisement -

Old man murder in Rajendra Nagar

 

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని మరో వృద్ధుడు గ్లాస్ ముక్కతో పొడిచి హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  బండ్లగూడ ప్రాంతం జాగీర్ లోని సన్ సిటీ ప్రైమ్ ఓల్డ్‌ హోమ్ గెరియాట్రిక్స్ హోమ్ లో ఇద్దరు వృద్దుల మద్య ఘర్షణ చోటుచేసుకుంది. సాదీక్ హుస్సేన్ అనే వృద్ధుడిని అయాజ్ అబ్దుల్ అనే వృద్ధుడు   కిటికి గ్లాస్ తో పొడిచాడు.  సాదీక్ హుస్సేన్ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  చిన్న పాటి వివాదమే ప్రాణాలు తీసిందని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని పొలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News