Thursday, January 9, 2025

మెడ కోసి వృద్ధుడి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: మండలంలోని ఈదులవాడ గ్రామానికి చెందిన మారశెట్టి మల్లయ్య (75) అనే వ్యక్తి మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు మెడి కోసం హత్యచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లయ్య మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి, ఇంటి ముందర గల వాకిట్లో మంచం మీద పడుకున్నడని, తెల్లవారుజామున అతని కూతురు లేచి వాకిలి ఊడుస్తు తండ్రిని లేపగా ఎంతకు లేవకపోయోసరికి కుటుంబ సభ్యులకు చెప్పగా అందరు వచ్చి చూడగా అతని మెడ మీద ఎదో పదునైన ఆయుధంతో మెడ కోసి ఉందని, అతను అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News