బెంగళూరు: ధోవతి ధరించి వచ్చిన వృద్ధుడిని ఓ మాల్‌లో లోనికి రానివ్వలేదు. ప్యాంట్ వేసుకొని వస్తేనే అనుమతిస్తామని సెక్యూరిటీ సిబ్బంది ఆయనతో నిక్కచ్చిగా చెప్పడంతో అతను విస్తు పోయాడు. ఈ ఘటన బెంగళూరులోని జిటి మాల్‌లో చోటు చేసుకుంది. వృద్ధుడితో పాటు అతని కొడుకు కూడా మాల్‌కి వచ్చాడు. కొడుకు ఎంత అభ్యర్థించినా భద్రతా సిబ్బంది వినలేదు. తన తండ్రిని లోనికి అనుమతించాలని ఆ కొడుకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సదరు మాల్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సినిమా కోసం వారు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో వారు మాల్ ప్రవేశద్వారం ద్వారా లోనికి వెళుతుండగా భద్రతా సిబ్బంది ఆ తండ్రీకొడుకులను నిలిపివేశారు. మాల్ నిబంధనల ప్రకారం ధోవతి ధరించిన వారికి లోనికి అనుమతి లేదని సెక్యూరిటీ సిబ్బంది వారితో వాదించారు.
తన తండ్రి దూర ప్రాంతం నుంచి వచ్చారని, అప్పటికప్పుడు దుస్తులు మార్చుకునే సమయం దొరకలేదని, అందుకే వచ్చామని చెప్పినప్పటికీ సిబ్బంది వినలేదు. కచ్చితంగా ప్యాంట్ మార్చుకొని రావల్సిందేనని సూచించారట. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘వృద్ధుడికి ఇచ్చే గౌరవం ఇదా?’’ అని కామెంట్ చేస్తున్నారు.
ఈ అంశంపై బిజెపి జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ధోవతి ధరించినందుకు రైతులను తిట్టడం, అవమానించడం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కర్ణాటక ముఖ్యమంత్రి ధోవతి ధరిస్తారు కానీ… మాల్‌లోకి రైతును ధోవతితో అనుమతించరా?’’ అన్నారు.
A farmer with #Dhoti wasn't allowed in #GTMall at #Bengaluru
Its the cultural attire and shaan of india and is it fair that farmers or any normal person have to face such a situation?. pic.twitter.com/xNK3jNgBOw
— Madhu M (@MadhunaikBunty) July 17, 2024