Wednesday, January 22, 2025

అంబులెన్స్ గుంతలో పడితే.. పోయిన ప్రాణం లేచి వచ్చింది!

- Advertisement -
- Advertisement -

హర్యానాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మృతదేహాన్ని తీసుకువెళ్తున్న అంబులెన్స్ గోతిలో పడటంతో, ఆ శవానికి పోయిన ప్రాణం తిరిగివచ్చింది.

వివరాల్లోకి వెళ్తే… హర్యానాలోని కర్నాల్ అనే ఊరికి చెందిన దర్శన్ సింగ్ బ్రార్ వయసు 80 ఏళ్లు. ఆయనకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఆయన సోదరుడు పాటియాలాలోని ఒక ఆస్పత్రిలో చేర్పించాడు. దర్శన్ సింగ్ కు డాక్టర్లు వెంటిలేటర్ అమర్చారు. నాలుగు రోజుల తర్వాత, గురువారంనాడు దర్శన్ ఆరోగ్యం క్షీణించడంతో డాక్టర్లు పరీక్షించి, గుండె కొట్టుకోవట్లేదనీ, ముసలాయన చనిపోయాడని నిర్థారించారు. ఆయనకు అమర్చిన వెంటిలేటర్ కూడా తీసేశారు. దాంతో దర్శన్ సింగ్ మనవడు బల్వన్.. తాతగారి మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామమైన కర్నాల్ కు బయల్దేరాడు.

అంబులెన్సు ధండ్ గ్రామ సమీపానికి రాగానే, ఓ గుంతలో పడింది. ఆ ధాటికి దర్శన్ సింగ్ చెయ్యి కదలడాన్ని బల్వన్ గమనించాడు. వెంటనే అంబులెన్స్ ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాడు. అక్కడి డాక్టర్లు పరీక్షించి, దర్శన్ సింగ్ ప్రాణాలతోనే ఉన్నాడని చెప్పి, చికిత్స మొదలుపెట్టారు. చనిపోయాడనుకున్న తన తాతగారు మళ్లీ బతకడంతో మనవడి ఆనందానికి హద్దులు లేవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News