Wednesday, January 22, 2025

వృద్ధుడిని 8 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు

- Advertisement -
- Advertisement -

 

 

వృద్ధుడ్ని ఢీకొట్టిన కారు 8 కిలోమీటర్ల దూరం వరకు బానెట్‌పై ఈడ్చుకెళ్లింది. కొత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంగ్రా గ్రామానికి చెందిన 70 ఏళ్ల శంకర్, సైకిల్‌ తొక్కుతూ క్రాస్‌ రోడ్డ్‌ వద్ద జాతీయ రహదారి 27ను దాటుతున్నాడు. ఇంతలో వేగంగా వచ్చిన కారు ఆ వృద్ధుడ్ని ఢీకొట్టింది. కారు బానెట్‌పై పడిన ఆయన వైపర్‌ను గట్టిగా పట్టుకుని వేలాడాడు. కారు ఆపాలని కేకలు వేశాడు.
ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు కూడా దీనిని చూసి కారు నిలుపాలంటూ గట్టిగా అరిచారు. అయినా డ్రైవర్‌ కారును ఆపలేదు. కొందరు ఫాలో కావడంతో కారును వేగంగా నడిపి సడన్‌ బ్రేక్‌ వేశాడు. దీంతో బానెట్‌పై ఉన్న వృద్ధుడు కారు ముందుపడ్డాడు. అయినప్పటికీ కారు ఆపకుండా నిర్లక్ష్యంగా వృద్ధుడి పైనుంచి కారును నడిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు జాతీయ రహదారిలోని ప్రాంతాల పోలీస్‌ స్టేషన్లను అలెర్ట్‌ చేశారు. దీంతో ఒకచోట ఆగి ఉన్న కారును పిప్రకోఠి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన కారు డ్రైవర్‌, అందులో ప్రయాణించిన వారి కోసం వెతుకుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News