Monday, December 23, 2024

రూ. 5 కోట్ల లాటరీ కొట్టిన వృద్ధుడు

- Advertisement -
- Advertisement -

నూమొహాలి(పంజాబ్): ఆ 88 ఏళ్ల కురువృద్ధుడికి తలరాత రాత్రికి రాత్రే మారిపోయింది. రూ. 5 కోట్ల లాటరీ కొట్టి కోటీశ్వరుడుగా మారిపోయాడు. డేరాబస్సీ క్యాంపుకు ఎందిన హమంత్ ద్వారా దాస్ అనే వృద్ధుడు లోహ్రీ మకర్ సంక్రాంతి బంపర్ లాటరీలో గెలుపొందడంతో అతడి దశ తిరిగిపోయాయింది. ఈ విషయం బయటకురావడంతో ఆఅతడు ఉండే ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.

స్థానికులు ఎద్ద సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుని అభినందనలతో ముంచెత్తారు. లాటరీ టిక్కట్లు కొనడం తనకు చాలారోజుల నుంచి ఉందని దాస్ తెలిపాడు. లాటరీలో వచ్చే మొత్తంలో సగం సొమ్మును డేరాకు(సంఘానికి) అందచేస్తానని, మిగిలిన సొమ్మును తన ఇద్దరు కుమారులకు సమానంగా పంచిపెడతానని దాస్ చెప్పాడు. పన్నులను మినహాయించుకుని దాస్‌కు రూ.3.5 కోట్లు లాటరీ సొమ్ము వస్తుందని లాటరీ టిక్కెట్ ఏజెంట్ లోకేష్ తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News