Monday, December 23, 2024

ప్రయాణికుల కోసం పాత జ్ఞాపకాలు

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన ఆర్టీసి ఎండి సజ్జనార్

Old memories for travelers

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎస్ ఆర్టీసి ఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్టీసి పురోగతిపై సజ్జనార్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆర్టీసిలో కీలక మార్పులు చేపట్టిన ఆయన ప్రయాణికులకు ఆర్టీసికి చేరువ చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం సజ్జనార్ సోషల్ మీడియాను బాగా ఉపయోగిస్తున్నారు. ఆసక్తికర పోస్టులతో సోషల్ మీడియాలో ఆర్టీసికి మరింత మైలేజ్ పెంచుతున్నారు. ఆర్టీసిపై సజ్జనార్ పెట్టే ఆసక్తికర పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆర్టీసి బస్సులకు సంబంధించి పాత జ్ఞాపకాలను సజ్జనార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1932 నుంచి ఇప్పటివరకు బస్ మోడల్స్ ఎలా మారాయో అనే విషయంపై ఒక వీడియోను సజ్జనార్ పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News