Thursday, January 23, 2025

పాత నేరస్థుల బైండోవర్

- Advertisement -
- Advertisement -

ఝరాసంగం: నాటు సారా కేసులో పాత నేరస్తులుగా ఉన్న ఝరాసంగం మండల కేంద్రంలోని వనంపల్లి తాండకు చెందిన రాథోడ్ జైపాల్, రాథోడ్ ఆశాబాయ్ నిందితుల్ని బుధవారం జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు స్థానిక ఇంచార్జి తహశీల్దార్ రాజిరెడ్డి ముందు బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నాటు సారా గుడుంబా తయారీ నిషిద్ధమని ఎందుకు విరుద్ధంగా ఎవరైనా నాటు సారా గుడుంబా తయారు చేస్తే చట్ట రిత్యా చర్యలు తీసుకోవడంతో పాటు వీ రికి రెండు లక్షల రూపాయల జరిమానా విధించడం కాకుండా ప్రభుత్వ పరంగా వచ్చే రైతుబంధు కట్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శాంతా ఎక్సైజ్ సిబ్బంది యాదయ్య,మోహన్,సురేష్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News