Monday, December 23, 2024

విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ డిమాండ్

- Advertisement -
- Advertisement -

టిఎస్‌ఈఈఎఫ్ యూనియన్

హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టిఎస్‌ఈఈఎఫ్ ( తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ ఫోరమ్ నాయకులు శ్రీనివాస్,సురేష్ డిమాండ్ చేశారు. శనివారం టిఎస్‌సిపిఎస్‌ఈయు ( తెలంగాణ స్టేట్ కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ) అధ్యక్షుడు స్థితప్రజ్ఞను వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఫోరమ్ తరపున విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 1999 తరువాత నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.

ఇటీవల రాజస్థాన్, ఛత్తీస్ గడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాలు సీపీస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాయని వారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. తెలంగాణలో సైతం ఆయా రాష్ట్రాల్లో మాదిరిగా పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. పాత పెన్షన్ విధానం అమలు కోసం చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు పూర్తిగా స్థిత ప్రతిజ్ఙ ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News