Monday, December 23, 2024

డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
  • ఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ

సంగారెడ్డి టౌన్: ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రతి నెల జీవన భృతి పొందడం ఉద్యోగి హక్కు అని ఉద్యోగుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు సాబేర్ అలీ అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ఎస్‌టియు కార్యాలయ ంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు సిపిఎస్ అనే నూతన అసంబద్ద విధనాన్ని ఉద్యోగుల ఇష్టాలను పక్కనపెట్టి బలవంతంగా తీసుకురావడం దుర్మార్గమన్నారు.

వెంటనే సిపిఎ స్ విధానాన్ని రద్దుచేసి ఓపిఎస్ విధనాన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశా రు. 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్సన్ విధనాన్నీ అమలు చేయాలన్నారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, నాయకులు రమణకుమార్, జీవన్ రాథోడ్, రహమాన్, ప్రతాప్‌రెడ్డి, రాజ్‌కుమార్, సుమలత తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News