Monday, January 20, 2025

విద్యుత్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

Old pension should be implemented for electricity employees

మంత్రి జగదీష్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన
తెలంగాణఫ విద్యుత్ ఉద్యోగుల ఫోరమ్

హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలో 1999 నుంచి 2004 వరకు సుమారు 18 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరికి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఫోరమ్(టిఎస్‌ఈఈఎఫ్) నాయకులు విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని శుక్రవారం మినిస్టర్ క్వార్ట్‌ర్స్‌లో కలిసి వినతి పత్రం అందచేశారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2022ను వ్యతిరేకిస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ అమలుకు సంంధించి సాధ్యాసాధ్యాలను తెలుసుకుకోవడమే కాకుండా ఆర్థికంగా ఎంతభారం పడుతుంది అనే అంశాన్ని చర్చించి పెన్షన్ అమలు విషయంపై పూర్తి వివరాలతో మంత్రి రమ్మన్నారని వారు తెలిపారు.

తెలంగాణ విద్యుత్ సంస్థలలో పని చేస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులు టిఎస్‌ఈఈఎఫ్‌కు సంఘీభావం తెలిపినట్లు చెప్పారు.పాత పెన్షన్ అమలు కోసం టిఎస్‌పీఈ జేఏసీ నాయకులు సాయిబాబా, టి జాక్ కన్వీనర్ శివాజీల సహకారం కోరినట్లు వారు తెలిపారు. ఇప్పటికే చత్తీస్‌ఘడ్ ,రాజస్తాన్, రాష్ట్రాలు పాత పెన్షన్ అంశంపై నిర్ణయం తీసుకోగా జార్ఖండ్ రాష్ట్రంలో అగస్టు 15 నుంచి అమలు చేస్తామని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఏఐపిఈఎఫ్, ఎన్‌సీసీఓఈఈఈ ( అఖిల భారత విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల కమిటీ) ఆధ్వర్యంలో అందరికి పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ రంగంలో పిఆర్సీతో పాటు అందరికి పెన్షన్ అమలు చేయాలని విద్యుత్ సంస్థలకు, ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ విద్యుత్ రాష్ట్ర ఉద్యోగుల ఫోరమ్ నాయకులు శ్రీనివాస్, మల్లేష్, సురేష్‌బాబు, ప్రేమ్, సంజీవ్, చక్రవర్తి, విజయ్, ఉదయ్, కృష్ణ, ముత్తయ్య ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News