Monday, December 23, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి: ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో 2004కు ముందు ఎంపికైన ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం 2020లో ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ తెలంగాణలో మాత్రం ఆ ఉత్తర్వుల అమలుకు నోచుకోలేదని ట్విట్ చేశారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు కర్ణాటక, పంజాబ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు 2002, 2003 డిఎస్సీ ఉపాధ్యాయులతోపాటు గ్రూపు 2 , పోలీస్, జ్యూడిషరీ, హెల్త్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ను అమలుచేయాలని సూచించారు. పాత పెన్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది గడువు ఆగస్టు 31తో ముగుస్తోందని, దీంతో స్కీమ్ ను తమకు అమలు చేస్తారో లేదోనని వేలాది మంది ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి అర్హులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News