Sunday, December 22, 2024

కుమార్తె ఆరోగ్యం బాగోలేదని వచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు

- Advertisement -
- Advertisement -

నవాబ్‌పేట: ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి చెందిన సంఘటన నవాబ్‌పేట మండలంలో శనివారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా గొల్లపల్లికి చెందిన లక్ష్మీ(65) వికారాబాద్ జిల్లా కౌకుంట్ల గ్రామంలో ఉండే తన కూతురు లలిత ఆరోగ్యం బాగాలేదని, ఆమెను ఆస్పత్రికి చూపించేందుకు బయలుదేరింది. ఈ నేపథ్యంలో నవాబ్‌పేట మండలంలోని మైతబ్‌ఖాన్‌గూడవద్ద వికారాబాద్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది.

బస్సు ప్రయాణించే సమయంలో మార్గమధ్యలో లక్ష్మీ అకస్మికంగా మృతి చెందారని, ఈ విషయాన్ని గుర్తించిన బస్సు కండక్టర్ మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కుమార్తె ఆరోగ్యం బాగు చేయించేందుకు వచ్చిన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడంపట్ల పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News