Thursday, January 2, 2025

అమ్మమ్మను భవనంపై నుంచి తోసి చంపిన మనవడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని కవాడిగూడలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన అమ్మమ్మను భవనంపై నుంచి తోసి చంపాడు. భవనం పై నుంచి కింద పడిన కొత్త సుశీల(72) వృద్ధురాలి కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. డబ్బులు అడిగితే ఇవ్వలేదని మనవడు నితిన్‌(32), అమ్మమ్మను భవనంపై నుంచి తోసేసిట్లు సమాచారం. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, నిందితుడు మానసిక రోగి అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News