హోం ఐసోలేషన్‌లో కోలుకున్న వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వృద్ధురాలు
ప్రభుత్వ మందులు మస్తు పనిచేశాయంటూ కితాబు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 102 ఏళ్ల బామ్మ కరోనా నుంచి సులువుగా కోలుకుంది. ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కిట్‌ను 14 రోజుల పాటు వాడి ఆ రోగ్యవంతంగా మారి అందరికీ ఆదర్శంగా నిలిచింది. మెడికల్ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లా భీమవడ్డెరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చె ందిన అరకుల కొమరమ్మ(102)కు మే 20 వ తేదీన పాజిటివ్ వచ్చింది. దీంతో స్థానిక పిహెచ్‌సి అధికారులు హోం ఐసోలేషన్ కిట్ ఇచ్చి మందులు వాడాలని సూచించారు. దీంతో క్రమం తప్పకుండా ఆమె ఆ మందులను తన మనవడు సహాయంతో వాడుతూ, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మెరుగైన ఆహారం తీసుకున్నారు.
వా రం రోజుల్లో వైరస్ లోడ్ కంట్రోల్ కాగా, బలహీనత నుంచి బయటపడేందుకు మరో 13 రోజుల సమయం పట్టింది. దీంతో ఈనెల 14వ తేది మరోసారి టెస్టు చేయించుకోగా నెగటివ్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈక్రమంలో ఆ బామ్మ మాట్లాడుతూ..ప్రభుత్వం ఇచ్చిన మందులు మస్తు పనిచేశాయంటూ కితాబిచ్చింది. అయితే తనకు బిపి, షుగర్ వంటివి లేకపోవడంతోనే చికిత్స సమయంలో ఎలాంటి శ్వాస, ఇతర సమస్యలు రాలేదని డాక్టర్లు తెలిపారు. అంతేగాక ఆమె నిత్యం బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వలన కేవలం హోం ఐసోలేషన్ మందులతోనే కోలుకున్నట్లు వివరించారు. కరోనా తేలగానే టెన్షన్ పడే ఈ రోజుల్లో ఈ బామ్మ అందరికి స్పూర్తినిచ్చిందని అధికారులు ఆనం దం వ్యక్తం చేశారు. సెకండ్ వేవ్‌లో హోం ఐసోలేషన్‌లో కోలుకున్న గరిష్ఠ స్థాయి వయస్కుల్లో ఈమె మొదటి వ్యక్తి కావడం గమనార్హం.